సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వారణాసి మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటినుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. వరల్డ్ వైడ్ గా జక్కన్న చేసే మ్యాజిక్ కోసం సినీప్రియులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడు నాలుగు షెడ్యూళ్లు పూర్తి అయినా ఎలాంటి అప్డేట్స్ రాలేదని అంతా అప్సెట్ అయ్యారు. కానీ రీసెంట్ గా జక్కన్న ఒక భారీ ఈవెంట్ నిర్వహించి మహేష్ లుక్, టైటిల్ రివీల్ చేసి చాలా సర్ప్రయిజ్ లిచ్చారు. దీనితో వారణాసి పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో వారణాసి సినిమాకి చెందిన ప్రతి విషయం సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది.
తాజాగా వారణాసి స్టార్స్ రెమ్యునరేషన్ పై చర్చ జరుగుతోంది. జనరల్ గా హీరో రెమ్యునరేషన్ భారీగా ఉంటుంది. కానీ వారణాసి మూవీ కోసం రాజమౌళి మహేష్ కంటే ఎక్కువ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వారణాసి మూవీకి గాను రాజమౌళి 200 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. RRR మూవీ తరువాత జక్కన్న రేంజ్ మరింత పెరిగింది. గ్లోబల్ వైడ్ గా రాజమౌళి టేకింగ్ కి క్రేజ్ ఏర్పడింది. అందుకే వారాణసి మూవీకి ఈ రేంజ్ పేమెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
జక్కన్న మేకింగ్ పై ఉన్న నమ్మకంతో నిర్మాతలు కూడా అడిగినంత ఇస్తున్నారని సమాచారం. జక్కన్న తరువాత ప్లేస్ లో మహేష్ ఉన్నారు. మహేష్ రెమ్యునరేషన్ 150 కోట్లు అని తెలుస్తోంది. ప్రియాంకా చోప్రా కి 12 కోట్లు, విలన్ గా చేస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కి 16 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ దర్శకుడు కీరవాణికి 12 కోట్లు ఇస్తున్నారట. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న వారాణసి ప్రాజెక్టు కోసం మెయిన్ స్టార్స్ రెమ్యునరేషన్స్ 400 కోట్లు ఉండటం విశేషం. మిగతా టెక్నీషీయన్స్, నటీ నటుల రెమ్యునరేషన్స్ ఇంకో 200 కోట్లు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు.





