గత కొన్ని రోజులుగా ఐ బొమ్మ రవి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. కొందరు రవి అరెస్ట్ ని సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు రవి ని సపోర్ట్ చేస్తూ ఫాన్స్ గా మారుతున్నారు. ఈ క్రమంలోనే ఐ బొమ్మ రవి బయోపిక్ ని తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు అని టాక్. రవి అరెస్ట్ తరువాత అతనికి సంబధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని లైఫ్ లో చాలా వివాదాలు, విషాదాలున్నాయని తెలుస్తోంది. రవి కి చెందిన ఏ న్యూస్ అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరలైపోతోంది. ఈ మధ్య కాలంలో రవిలా ఎవరు పాపులర్ కాలేదని చెప్పొచ్చు.
లేటెస్ట్ గా రవి ఆస్తులపై కూడా చర్చ జరుగుతోంది. రవి ఆస్తుల విలువ తెలిసి అంతా నోరెళ్ళ బెడుతున్నారు. రవి పైరసీ తో పాటు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ద్వారా 100 కోట్లకి పైగా సంపాదించినట్లు ఇన్వెస్ట్ గేషన్ లో తేలింది. సుమారు 21000 సినిమాలను పైరసీ చేసాడు. సర్వర్లతో కాకుండా క్లౌడ్ సర్వీస్ ద్వారా డేటాను సేవ్ చేసాడని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ కూడా రంగంలోకి దిగి రవి ఆస్తులపై విచారణ చేపడుతోంది. బెట్టింగ్ యాప్ లు, హవాలా వ్యవహారాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. రవికి టోటల్ గా 35 బ్యాంకు అకౌంట్ లున్నట్లు అధికారులు గుర్తించారు. పైరసీ, బెట్టింగ్ యాప్స్ ద్వారా ఏకంగా 100 కోట్లు సంపాదించటం అంటే మాములు విషయం కాదని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. రవి రిమాండ్ పూర్తి అయింది కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఒక కేసులో రిలీజ్ అయినా ఇంకొక కేసు పెట్టి రిమాండ్ లోనే ఉంచాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.





