HomeMovie News Teluguహార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా నిలిచిన ‘రాజు వెడ్స్ రాంబాయి’

హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా నిలిచిన ‘రాజు వెడ్స్ రాంబాయి’

అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 15 ఏళ్ల క్రితం జరిగిన నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ప్రేక్షకులు, విమర్శకులు ఇద్దరూ ఈ సినిమాను హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా అభివర్ణిస్తూ మంచి స్పందన ఇస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ జర్నీ శుభారంభం అయ్యింది.

ప్రత్యేకంగా, ఏపీ-తెలంగాణలో తొలి రోజే ₹1.47 కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. డే 1 నుంచే బలమైన వసూళ్లు రావడం మూవీ టీమ్‌కి ఆనందాన్ని కలిగిస్తోంది.

ఈ చిత్రాన్ని డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్‌సూన్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు.

వంశీ నందిపాటి ఎంటర్‌టైన్మెంట్స్, బన్నీవాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీవాస్ ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌గా అందించారు. అఖిల్ రాజ్, తేజస్వినీ రావ్‌తో పాటు శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం వంటి పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular