భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన (Smriti Mandhana) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఇటీవల కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గ్రాండ్ నిశ్చితార్థం తర్వాత, నవంబర్ 23న ఆమె వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో స్మృతికి కాబోయే భర్త, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.
తాజాగా పలాష్ స్మృతికి ఇచ్చిన సర్ప్రైజ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కళ్లకు గంతలు కట్టి స్మృతిని మహారాష్ట్రలోని డీవై పాటిల్ స్టేడియానికి తీసుకెళ్లిన పలాష్, గ్రౌండ్ మద్యలో ఆమెను నిలబెట్టించి మోకాళ్లపై కూర్చొని రొమాంటిక్గా ప్రపోజ్ చేశారు. స్మృతి “యెస్” చెప్పగానే, ఆమెను ఆనందంగా హగ్ చేసుకుని బొకే అందించారు.
ఈ స్టేడియంలోనే ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్లో స్మృతి మంధాన జట్టు గెలిచిన విషయం తెలిసిందే. ఆ విజయస్మృతులు ఉన్న ఈ ప్రదేశంలోనే ప్రపోజ్ చేయాలని పలాష్ ముందుగానే ప్లాన్ చేశారని ఆయన స్నేహితులు వెల్లడించారు. స్మృతికి ఇక్కడ మంచి రికార్డులు ఉండటం వల్ల ఈ గ్రౌండ్తో వ్యక్తిగతంగా ప్రత్యేక అనుబంధం ఉందని కూడా చెబుతున్నారు.
ఈ రొమాంటిక్ ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. పోస్ట్ చేసిన గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం.





