HomeMovie News Teluguఐబొమ్మ రవి ఇష్యూపై ఆర్జీవీ సెన్సేషనల్ ట్వీట్..!

ఐబొమ్మ రవి ఇష్యూపై ఆర్జీవీ సెన్సేషనల్ ట్వీట్..!

గత కొద్దిరోజులుగా ఐబొమ్మ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పైరసీ కేసులపై పోలీసులు చర్యలు వేగవంతం చేసిన నేపథ్యంలో, ఎన్నో థియేటర్లు మరియు నిర్మాతలకు భారీ నష్టం కలిగించిన ఇమ్మడి రవిని ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రవి పోలీసుల విచారణలో ఉండగా, పలు సంచలన విషయాలు బయటపడుతుండటంతో జనాలు షాక్‌కు గురవుతున్నారు.

ఐబొమ్మ రవికి కొందరు సపోర్ట్‌గా నిలుస్తుండగా, మరికొందరు తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ఈ క్రమంలో, వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తాజా ట్వీట్‌తో మరోసారి దృష్టిని ఆకర్షించారు.

ఆర్జీవీ తనదైన శైలిలో ఇలా వ్యాఖ్యానించారు:
“టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా పైరసీ ఎప్పుడూ ఆగదు. అలాంటి సినిమాలను చూడటానికి ప్రజలు ఉన్నంతకాలం, రవిలాంటి వారు సేవ చేసేందుకు కూడా ఉంటారు.

సినిమా పరిశ్రమలో ఉన్న చాలామందితో పాటు నేను కూడా సమయం ఆదా అవుతుందని కొన్నిసార్లు పైరసీ కంటెంట్ చూస్తాం.

ఇక్కడ నవ్వొస్తున్న విషయం ఏమిటంటే, తప్పు చేసిన రవిని ‘రాబిన్ హుడ్’‌తో పోలుస్తున్నారు. అసలు రాబిన్ హుడ్ హీరో కాదు… ప్రపంచంలోని తొలి ఉగ్రవాది.”

ఇక్కడితో ఆగకుండా, ఆర్జీవీ మరో కౌంటర్ పేల్చారు “పైరేటెడ్ కంటెంట్ చూసే 100 మందిని అరెస్టు చేసి, వారి పేర్లను పబ్లిక్ చేయండి. అప్పుడు ఎవరూ సినిమా లింక్ చూడటానికి లేదా ఫార్వార్డ్ చేయడానికి భయపడతారు.”

అలాగే.. “సినిమా టికెట్ రేట్లు ఎక్కువైతే, పాప్‌కార్న్ ధరలు అధికంగా ఉంటే అది వేరే విషయం. కానీ ఇలా పైరసీ చేయడం చాలా పెద్ద తప్పు. ఈ ఆలోచనా విధానం సమాజ పతనానికి దారితీస్తుంది” అని ఆర్జీవీ స్పష్టం చేశారు.

మొత్తానికి, ఐబొమ్మ రవి ఇష్యూపై ఆర్జీవీ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట మళ్లీ పెద్ద చర్చకు దారి తీశాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular