స్టార్ హీరో మోహన్‌బాబు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. మంచు మనోజ్ (Manchu Manoj) వ్యక్తిగత కారణాలతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కుటుంబ సమస్యల కారణంగా ఎక్కువ సమయం తన భార్య, పిల్లలతో గడుపుతూ వస్తున్నాడు.
అయితే ఇటీవల ‘భైరవం’ సినిమాతో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. అదేకాక, తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’లో కీలక పాత్ర పోషించి మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వరుస విజయాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మనోజ్ కెరీర్ కొత్త దిశగా సాగుతోంది.
తాజాగా మనోజ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలోని భారీ సినిమాలో విలన్‌గా ఛాన్స్ పొందినట్లు టాలీవుడ్లో టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ఒకవైపు వ్యక్తిగత జీవితం.. మరోవైపు ప్రొఫెషనల్ కెరీర్‌ని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్న మంచు మనోజ్ సోషల్ మీడియాలోనూ విపరీతంగా యాక్టివ్‌గా ఉంటున్నారు.
Music has always been my escape, my expression, my truth.
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) November 22, 2025
Today, that journey evolves.
Introducing my new global music venture,
Mohana Raga Music 🙏🏾❤️
Built for fresh sounds, bold talent, and fearless creativity. 🎼🌍#MohanaRagaMusic #GlobalMusic #FreshSounds #BoldTalent… pic.twitter.com/iyK27jzqyM
ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన ఆసక్తికరమైన ట్విస్ట్ ఇచ్చాడు. వరుస సినిమాలు చేస్తాడనుకుంటే.. ‘మోహన రాగా’ పేరుతో ఓ మ్యూజిక్ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. సంగీతం తనను ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తుందని, ప్రతిభను ప్రోత్సహించడమే తన లక్ష్యమని మనోజ్ పేర్కొన్నారు.
“Local Hearts, Global Beats” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ కొత్త ప్రయాణాన్ని ప్రకటించిన మనోజ్‌కు నెటిజెన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.





