HomeMovie News Teluguనయనతారకు మరో ఆఫర్.. బాలయ్య సినిమా కోసం కోట్లలో రెమ్యూనరేషన్?

నయనతారకు మరో ఆఫర్.. బాలయ్య సినిమా కోసం కోట్లలో రెమ్యూనరేషన్?

నందమూరి బాలకృష్ణ ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ తన స్పీడ్ తగ్గించకుండా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం అఖండ 2 చిత్రంతో బిజీగా ఉన్న బాలయ్య, మరో నెలలో కొత్త సినిమా ప్రారంభించనున్నారు. ఈసారి గోపీచంద్ మలినేనితో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

NBK 111 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా నవంబర్ 7న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని సమాచారం. ఇంతకుముందు బాలయ్య–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ విజయాన్ని మరలా రిపీట్ చేయాలనే ఉద్దేశ్యంతో మరోసారి గోపీచంద్‌కు ఛాన్స్ ఇచ్చారు బాలయ్య.

ఈసారి కథ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు రెండు కాలాలకు సంబంధించిన హిస్టారికల్ డ్రామాగా ఉండబోతుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో కథ నడుస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. ఇందులో బాలయ్య డబుల్ రోల్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా ఫైనల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు కూడా బాలయ్య సరసన నయనతార పలు విజయవంతమైన సినిమాలు చేశారు. హిస్టారికల్ కాన్సెప్ట్ ఉన్న ఈ కథలో నయనతార బాలయ్యకు సరైన జోడీ అవుతారని భావించి, గోపీచంద్ మలినేని ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

నయనతారను రప్పించేందుకు నిర్మాతలు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular