HomeSports Teluguసిడ్నీలో దుమ్మురేపిన భారత్.. రోహిత్ సెంచరీ, కోహ్లీ క్లాస్‌ బ్యాటింగ్‌తో ఘన విజయం!

సిడ్నీలో దుమ్మురేపిన భారత్.. రోహిత్ సెంచరీ, కోహ్లీ క్లాస్‌ బ్యాటింగ్‌తో ఘన విజయం!

సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ ఘనంగా గెలుపొందింది. ఈ విజయానికి ప్రధాన కారణం రోహిత్ శర్మ(121) చేసిన శతకం మరియు విరాట్ కోహ్లీ(74) ఆడిన క్లాస్ ఇన్నింగ్స్‌ అని చెప్పాలి.

ఇటీవలి మ్యాచ్‌ల్లో రెండు సార్లు డకౌట్ అయిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి ఫ్యాన్స్‌ హృదయాలు గెలుచుకున్నాడు. అదే సమయంలో రెండో వన్డేలో ఫిఫ్టీ చేసిన రోహిత్ ఈసారి సెంచరీతో అదరగొట్టాడు.

ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థిని నిలువరించారు. 46.4 ఓవర్లలో ఆసీస్ 236 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు, సిరాజ్, కుల్‌దీప్‌, అక్షర్, ప్రసిద్ధ్‌కృష్ణ ఒక్కో వికెట్‌ తీయగా బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు.

తర్వాత 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ మొదట్లో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ, రోహిత్–కోహ్లీ జోడీ గేమ్‌ను పూర్తిగా మార్చేశారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (24) మరోసారి విఫలమైనా, సీనియర్ బ్యాట్స్‌మెన్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హెజిల్‌వుడ్ ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి ఆస్ట్రేలియా ఇప్పటికే సిరీస్‌ కైవసం చేసుకున్నప్పటికీ, ఈ గెలుపుతో భారత్‌ గౌరవప్రద ముగింపు ఇచ్చింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular