పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సెన్సేషనల్ సూపర్ హిట్ మూవీ ‘ఓజీ’(OG)పై కాపీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. విడుదలైన వెంటనే వసూళ్ల పరంగా రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిన ఈ సినిమా సీన్స్, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, థమన్ మ్యూజిక్ అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
అయితే తాజాగా ఈ సినిమాపై కన్నడ దర్శకుడు ఆర్. చంద్రు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ “2023లో రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా తీసిన నా సినిమా కబ్జా (Kabzaa)ని స్ఫూర్తిగా తీసుకుని ‘ఓజీ’ తీశారు. ఆ సినిమాలో ఉన్న అనేక సన్నివేశాలు నా సినిమాకు పోలికగా ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు.
చంద్రు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఫ్లాప్ అయిన ‘కబ్జా’ సినిమాతో ‘ఓజీ’ లాంటి బ్లాక్‌బస్టర్‌ని పోల్చడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “హిట్ అయిన పవన్ కళ్యాణ్ సినిమాను కాపీ అంటూ ప్లాప్ సినిమాతో పోల్చడం సరికాదు” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది దర్శకుడు ఆర్. చంద్రు తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.





