దేశ సేవనే పరమావధిగా భావించి ఎలాంటి ఫలితాలకూ ఆశపడకుండా కృషి చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని (PM Narendra Modi) మనం కర్మయోగిగా చూస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు.
కర్నూలులో నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ సభలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 (GST 2.0) సంస్కరణలతో ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “మోదీ గారు కేవలం దేశాన్ని మాత్రమే కాదు, రెండు తరాలను ముందుకు నడిపిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ (Atmanirbhar Bharat) ద్వారా దేశాన్ని ప్రపంచం గుర్తించే స్థాయికి తీసుకెళ్లారు” అని కొనియాడారు. అలాగే, “ఒక తరం కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు” అంటూ ఆయన ప్రశంసించారు.
కూటమి కనీసం 15 ఏళ్లపాటు బలంగా కొనసాగాలని పవన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.13,429 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు.





