దసరా సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగాయి. గాంధీ జయంతి కారణంగా అక్టోబర్ 2న మద్యం షాపులు మూసివేయగా, మందుబాబులు ముందుగానే భారీగా కొనుగోళ్లు చేశారు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లోనే రూ. 419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అందులో సెప్టెంబర్ 30న రూ. 333 కోట్లు, అక్టోబర్ 1న రూ. 86 కోట్ల మద్యం విక్రయాలు నమోదయ్యాయని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
అంతేకాదు, సెప్టెంబర్ 26 నుండి అమ్మకాలు సాధారణ రోజుల కంటే రెట్టింపు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఈ వారంలో మొత్తం అమ్మకాలు రూ. 1000 కోట్లకు చేరుకున్నాయి. దసరా మూడు రోజుల్లోనే 6.71 లక్షల కేసుల లిక్కర్, 7.22 లక్షల కేసుల బీర్ విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.
తెలంగాణలో సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ రెండు రోజుల్లోనే దాదాపు రూ. 419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30న రూ.333 కోట్లు, అక్టోబర్ 1న రూ.86 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. pic.twitter.com/UVYVBjZ0Fy
— Tolivelugu Official (@Tolivelugu) October 3, 2025
ఈసారి దసరా, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో ప్రభుత్వం మద్యం షాపులు, చికెన్, మటన్ దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది. దీంతో అమ్మకాలు తగ్గుతాయని అనుకున్నా.. విరుద్ధంగా మందుబాబులు ముందే భారీగా కొనుగోలు చేసి రికార్డు క్రియేట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైన్స్ మూసివేయగా, కొన్ని ప్రాంతాల్లో చికెన్–మటన్ దుకాణాలు మాత్రం తెరిచి ఉంచినట్లు సమాచారం. పోలీసులూ కూడా వాటిని చూసి చూడనట్లుగా వదిలేశారన్న చర్చ సాగుతోంది.





