HomeMovie News Teluguకొరియన్ కనకరాజు ట్రైలర్ అదిరింది..

కొరియన్ కనకరాజు ట్రైలర్ అదిరింది..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, స్టార్ కమెడియన్ సత్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా విడుదలైన కొరియన్ కనకరాజు ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

కమెడియన్ సత్య కామెడీతో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ ఆద్యంతం వినోదాన్ని పంచుతూ ఆకట్టుకుంటోంది. కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హారర్, యాక్షన్, కామెడీ అంశాలను దర్శకుడు మేర్లపాక గాంధీ వినూత్నంగా మేళవించినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. ఆయన కొత్త లుక్, మేకోవర్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా సత్య, వరుణ్ తేజ్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా కనిపిస్తున్నాయి.

హారర్‌కు యాక్షన్, కామెడీని జోడించి రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉండబోతోందనే అభిప్రాయం ట్రైలర్ చూసిన తర్వాత వ్యక్తమవుతోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular