కలర్స్ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్వాతి రెడ్డి అనంతరం హీరోయిన్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంతకాలంగా ఆమె వ్యక్తిగత జీవితం, రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారంలో ఉండగా, వాటికి తెరదించుతూ స్వాతి తన కొత్త జీవితాన్ని అధికారికంగా ప్రకటించారు.
2018లో పైలట్ వికాస్ వాసును వివాహం చేసుకున్న స్వాతి, అనంతరం వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆమె ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు శ్రీకాంత్ నాగోతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, చివరకు వివాహ బంధానికి దారితీసింది. జూలై 8న తాము వివాహం చేసుకున్నట్లు స్వాతి సోషల్ మీడియా వేదికగా ఫొటోలను పంచుకుంటూ అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్వాతి కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.





