HomeMovie News Teluguకన్నప్ప మరోసారి థియేటర్లలోకి..

కన్నప్ప మరోసారి థియేటర్లలోకి..

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం కన్నప్ప మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం విడుదల సమయంలో మంచి అంచనాలు రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించగా, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రలతో ఆకట్టుకున్నారు.

ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మితమైన కన్నప్ప చిత్రం 2025 జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పౌరాణిక కథాంశం, భారీ తారాగణం కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరవాలేదనిపించే వసూళ్లు సాధించింది.

ఇదిలా ఉంటే, తాజాగా ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రత్యేక రీ-రిలీజ్‌గా కన్నప్పను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. దీంతో ఈసారి కన్నప్పకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో, రీ-రిలీజ్‌లో బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular