HomeMovie News Teluguబాక్సాఫీస్ వద్ద పెద్ది ప్రభంజనం.. 5 రోజుల కలెక్షన్స్ ఇవే..!

బాక్సాఫీస్ వద్ద పెద్ది ప్రభంజనం.. 5 రోజుల కలెక్షన్స్ ఇవే..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం పెద్ది బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటోంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ కథనం, క్రీడా నేపథ్యంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటన, ఆయన పాత్రకు వచ్చిన స్పందన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.

తాజాగా చిత్రబృందం విడుదల చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం.. పెద్ది కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రన్ కొనసాగిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ, భావోద్వేగ సన్నివేశాలు, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం, బుచ్చిబాబు తెరకెక్కించిన కీలక సన్నివేశాలు సినిమాకు మరింత బలం చేకూర్చాయి.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, రవికిషన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. వారి నటనకు కూడా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితమవుతూ భారీ వసూళ్లను నమోదు చేస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular