HomeMovie News Teluguఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు ప్రత్యేక నివాళులు అర్పించారు. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ తెల్లవారుజామునే హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని తన తాతగారికి ఘన నివాళులు అర్పించారు.

ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తారక్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్‌ను సందర్శించారు. సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, చేతులు జోడించి కొద్దిసేపు మౌనంగా నిలబడి తాతగారిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తారక్ భావోద్వేగానికి లోనైనట్లు కనిపించారు. నందమూరి హీరోలు ఘాట్‌కు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న అభిమానులు తెల్లవారుజామునే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

‘జోహార్ ఎన్టీఆర్’, ‘జై ఎన్టీఆర్’ అంటూ అభిమానులు నినాదాలు చేస్తూ ఘాట్ పరిసరాలను మారుమోగించారు. మొత్తానికి, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తారక్ నివాళులు అర్పించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular