నందమూరి బాలకృష్ణ, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కానున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తుండగా, ఆ చిత్రం దసరా సందర్భంగా విడుదల కావచ్చని తెలుస్తోంది.
ఆ సినిమా షూటింగ్ పూర్తికాగానే, బాలయ్య – వివేక్ ఆత్రేయ మూవీని ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దసరా తర్వాత ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్.
ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. కథ విస్తృతంగా ఉండటంతో, దాన్ని ఒకే భాగంలో చెప్పడం కష్టమని భావించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ, ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఐడియాకు హీరో బాలయ్యతో పాటు నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అంతేకాకుండా, ఈ సినిమాకు ‘కురుక్షేత్రం’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
వివేక్ ఆత్రేయ ఇప్పటివరకు క్లాస్ కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, సరిపోదా శనివారం తో మాస్ దర్శకుడిగానూ తన సత్తా చాటాడు. ఇప్పుడు బాలయ్యతో సినిమా అంటే, పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించేలా ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
మొత్తానికి, బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





