బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. హనుమాన్ జయంతి సందర్భంగా దర్శకుడు నితీశ్ తివారీ ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ను రామ పేరుతో విడుదల చేశారు.
భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో.. సుమారు రూ. 4,000 కోట్ల వ్యయంతో ఈ చిత్రం రూపొందుతోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ మేకింగ్‌తో టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ టీజర్‌లో రణబీర్ కపూర్ రాముడిగా కనిపించిన తీరు ప్రత్యేకంగా నిలిచింది. ఆయనలో కనిపించిన ప్రశాంతత, రాజసం పాత్రకు పూర్తి న్యాయం చేసిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. సీతమ్మగా సాయి పల్లవి సహజ నటనతో ఆకట్టుకోగా, రావణుడిగా కన్నడ స్టార్ యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరింత గ్రాండియర్ తీసుకువచ్చింది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి చేరింది.
రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో మొదటి భాగం 2026 అక్టోబర్‌లో దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తంగా ఈ టీజర్‌తో ‘రామాయణ’ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.





