HomeMovie News Teluguప్ర‌భాస్ కోసం త‌ర‌లొచ్చిన జ‌న స‌ముద్రం.

ప్ర‌భాస్ కోసం త‌ర‌లొచ్చిన జ‌న స‌ముద్రం.

ఆదివారం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీ ప్ర‌భాస్ మానియాతో ఊగిపోయింది. భాగ్య‌న‌గ‌రానికి జ‌న స‌ముద్రం త‌ర‌లొచ్చిందా.. అన్న‌ట్టు అభిమానులు పోటెత్తారు. ఆదివారం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో `సాహో` ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి వేలాదిగా ప్ర‌భాస్ అభిమానులు త‌ర‌లొచ్చారు. ఇది వ‌ర‌కు ఏ సినిమా వేడుక‌లోనూ చూడ‌ని జ‌నం… `సాహో` వేడుక‌లో క‌నిపించారు.

ఈ స్థాయిలో అభిమానులు త‌ర‌లిరావ‌డం కూడా ఓ రికార్డే. రెండు రాష్ట్రాల న‌లుమూల‌ల నుంచి.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ త‌మ సొంత ఖ‌ర్చుతో రామోజీ ఫిల్మ్‌సిటీ చేరుకున్నారు. సాయింత్రం 6 గంట‌ల‌కు ఈవెంట్ మొద‌లైనా, మూడింటినుంచే.. అభిమానుల తాకిడితో ఫిల్మ్‌సిటీలోని స‌భా ప్రాంగ‌ణం కిక్కిరిసిపోయింది. వేలాది మంది గంట‌ల పాటు… నిల‌బ‌డే ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించారు. బాహుబ‌లితో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు ప్ర‌భాస్.

ఆల్ ఇండియా స్టార్ అయిపోయాడు. త‌న స్టామినా ఏమిటో.. సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వ‌చ్చిన ఫ్యాన్స్‌కి చూస్తే అర్థం అవుతుంది. సాహో విడుద‌లై.. ఎంత గొప్ప విజ‌యం సాధిస్తుందో, ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో తెలీదు గానీ – ఈ ప్రీ రిలీజ్ వేడుక మాత్రం రికార్డుగా మిగిల‌పోతుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular