HomeMovie News Telugu'కేజీఎఫ్‌ 2' మరో సంచలనమే.!

‘కేజీఎఫ్‌ 2’ మరో సంచలనమే.!

కన్నడ సినిమా స్థాయిని పెంచిన సినిమా ‘కేజీఎఫ్‌’. అంతవరకూ కన్నడ సినిమాపై ఉన్న చిన్నచూపు ఈ సినిమాతో తొలగిపోయింది. బాలీవుడ్‌ చిత్ర సీమ ఈ సినిమా గురించి ఎంత ఎక్కువగా మాట్లాడుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో మాట్లాడుకున్న సినిమా ఇది. బాక్సాఫీస్‌ వద్ద 200 కోట్లు వసూళ్లు చేసి, శాండిల్‌వుడ్‌ స్టామినా అంటే ఇది అని చాటి చెప్పిన చిత్రమిది.

కన్నడ నటుడు యష్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఇదే జోష్‌ని కంటిన్యూ చేస్తూ సీక్వెల్‌ రూపొందిస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నుండి పలువురు ప్రముఖ నటులు నటిస్తున్నారు. మున్నాభాయ్‌ సంజయ్‌దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కోలార్‌ గోల్డ్‌ మైన్స్‌ కథాంశంగా తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’లో యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్రధాన ఆకర్షణగా ఆకట్టుకున్నాయి.

ఈ రెండో పార్ట్‌లో అంతకు మించిన యాక్షన్‌ ఘట్టాలను దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించనున్నాడట. ఇప్పటికే దాదాపు చాలా వరకూ షూటింగ్‌ పూర్తయ్యింది. సెప్టెంబర్‌ చివరికల్లా ఆఖరి షెడ్యూల్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేయనున్నారనీ కేజీఎఫ్‌ టీమ్‌ నుండి అందుతోన్న తాజా సమాచారమ్‌. ప్రస్తుతం బెంగుళూరులో షూటింగ్‌ జరుపుకుంటున్న ‘కేజీఎఫ్‌ 2’ టీమ్‌ త్వరలో రామోజీ ఫిలిం సిటీలో సందడి చేయనుంది

You May Like This
- Advertisment -spot_img

Most Popular