HomeMovie News Teluguపవన్‌ కళ్యాణ్‌ ఈజ్‌ బ్యాక్‌.!

పవన్‌ కళ్యాణ్‌ ఈజ్‌ బ్యాక్‌.!

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రూపొందిన ‘చిత్రలహరి’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి, మంచి విజయం అందుకుని, సక్సెస్‌ఫుల్‌గా ధియేటర్స్‌లో రన్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి ఈ సినిమా చూసి చిత్రయూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఈ మైత్రీ మూవీస్‌ సంస్థకు పవన్‌ కళ్యాణ్‌ ప్రశంసలు కూడా దక్కాయి. సినిమా మంచి విజయం సాధించినందుకు ఫ్లవర్‌ బొకేస్‌ పంపించి స్పెషల్‌గా విషెష్‌ అందించారు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌

ఇదిలా ఉంటే, పవన్‌ స్పందన చూస్తుంటే, త్వరలోనే పవన్‌ కళ్యాణ్‌ ముఖానికి రంగేసుకోనున్నారనిపిస్తోంది. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. అందుకోసం పవన్‌ ఆ సంస్థ నుండి కొంత అమౌంట్‌ అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు సమాచారమ్‌ ఉంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో పవన్‌ కళ్యాణ్‌ చేయబోయే సినిమా మైత్రీ వాళ్లతోనే ఉండబోతోందనే సంకేతాలు అందుతున్నాయి. 

ఈ సినిమాకి దర్శకుడు డాలీ (కిషోర్‌ కుమార్‌ పార్ధ సారధి) దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ఇంతవరకూ రాజకీయాల పేరు చెప్పి, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల నుండి తాత్కాలికంగా బ్రేక్‌ తీసుకున్నారు. ఎలక్షన్స్‌ ముగిశాయి. రిజల్ట్‌ ఎలా ఉన్నా, ఆపై పవన్‌ కళ్యాణ్‌ తిరిగి సినిమాల్లో నటించే అవకాశాలున్నాయనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. ఈ సమాచారంలో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular