HomeMovie News Teluguరేజ్‌ ఆఫ్‌ టైగర్‌: సోషల్‌ మీడియా పోటెత్తింది

రేజ్‌ ఆఫ్‌ టైగర్‌: సోషల్‌ మీడియా పోటెత్తింది

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కొత్త సినిమా ‘అరవింద సమేత’ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోషల్‌ మీడియాలో సందడిని తీసుకొచ్చింది. రెండు మూడు రోజుల నుంచే సోషల్‌ మీడియా, ‘అరవింద సమేత’ హ్యాష్‌ ట్యాగ్‌తో హోరెత్తిపోయింది. ‘రేజ్‌ ఆఫ్‌ టైగర్‌’ హ్యాష్‌ట్యాగ్‌తోనూ ‘అరవింద సమేత’ సినిమాపై యంగ్‌ టైగర్‌ అభిమానులు ట్వీట్లు, పోస్టింగ్స్‌తో చెలరేగిపోయారు. 

అదే సమయంలో, యాంటీ ఫ్యాన్స్‌ కూడా రెచ్చిపోయారు. కొందరు సినిమాలోని సన్నివేశాల్ని యదాతథంగా చెప్పేస్తూ, రాక్షసానందం పొందితే, వారిని కంట్రోల్‌ చేయలేక యంగ్‌ టైగర్‌ అభిమానులు నానా తిప్పలూ పడ్డారు. పెద్ద సినిమాలు చాలావరకు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. అయితే, ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్‌ అభిమానులకీ, విజయ్‌ దేవరకొండ అభిమానులకీ మధ్య మాటల యుద్ధం మొదలవడంతో.. ఆ ఎఫెక్ట్‌ సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఇంకా గట్టిగా కన్పించింది. 

రౌడీస్‌ వర్సెస్‌ యంగ్‌ టైగర్‌ ఫ్యాన్స్‌ జరిగిన సోషల్‌ మీడియా యుద్ధం ఇంకా కొనసాగుతూనే వుంది. సినిమాని చూసొచ్చి, సినిమాలోని సన్నివేశాల గురించి లీకులు ఇచ్చినవారు, దుష్ప్రచారం చేసినవారు విజయ్‌ దేవరకొండ అభిమానులేనని యంగ్‌ టైగర్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. 

ఆ సంగతి పక్కన పెడితే, పలువురు హీరోల అభిమానులు.. తమ మద్దతుని యంగ్‌ టైగర్‌ సినిమాకి ప్రకటించి, ‘అభిమానుల మధ్య ఐక్యత’ కోసం ప్రయత్నించారు. వీరిలో విజయ్‌ దేవరకొండ అభిమానులూ వున్నారు. అంటే, గొడవలకు కారణమయ్యేది కేవలం దురభిమానులు మాత్రమేనని అర్థం కదా!

You May Like This
- Advertisment -spot_img

Most Popular