HomeMovie News Teluguఅతిలోకసుందరి వారసత్వం నిలబెట్టగలదా?

అతిలోకసుందరి వారసత్వం నిలబెట్టగలదా?

‘అతిలోకసుందరి’ శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తున్న సినిమా ‘ధడక్‌’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరాఠీలో ఘన విజయం సాధించిన ‘సైరత్‌’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోందీ సినిమా. శశాంక్‌ కైతాన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్‌, జీ స్టూడియో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

కాగా శ్రీదేవి కూతురు తొలి సినిమా కాబట్టి, ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నిర్మాత కరణ్‌జోహార్‌ సినిమా ప్రమోషన్స్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన కొన్ని వీడియో సాంగ్స్‌, ట్రైలర్‌ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. జాన్వీ కపూర్‌కి జోడీగా ఇషాన్‌ ఖత్తర్‌ నటిస్తున్నాడు. జంట చూడముచ్చటగా ఉందంటూ కాంప్లిమెంట్స్‌ వస్తున్నాయి.

అలాగే జాన్వీ, ఇషాన్‌ నటనకు ప్రోమోస్‌తోనే ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. కూల్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోందీ సినిమా. ఈ చిత్రంతో జాన్వీ కపూర్‌ నటిగా తానేంటో ప్రూవ్‌ చేసుకోవాలి. అలాగే తనపై శ్రీదేవి ప్రభావాన్ని కూడా నిరూపించుకోవాలి. నటన, డాన్సుల్లో ఆల్రెడీ శ్రీదేవి చాలా కాలంగా జాన్వీకి ట్రైనింగ్‌ ఇచ్చింది. ఎంతైనా తొలి సినిమా కాస్త టెన్షన్‌ ఉండడం సహజమే. అంతకు మించి, తల్లి లేదనే పెద్ద లోటు. జాన్వీకి ఎవ్వరూ తీర్చలేనిదే. 

చూడాలి మరి, తొలి సినిమాతో జాన్వీ కపూర్‌ శ్రీదేవి కూతురుగా ఎలాంటి స్టాంప్‌ వేస్తుందో.

You May Like This
- Advertisment -spot_img

Most Popular