HomeMovie News Teluguరానాతో చందమామ ఇంకోస్సారి.?

రానాతో చందమామ ఇంకోస్సారి.?

అంతవరకూ హిట్స్‌ లేక సతమతమవుతున్న క్రియేటివ్‌ డైరెక్టర్‌ తేజకి ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మళ్లీ బ్రేక్‌ వచ్చింది. రానా – కాజల్‌ ఈ చిత్రంలో జంటగా నటించారు. ఈ ఇద్దరి కాంబో తేజకి బాగా కలిసొచ్చింది. అందుకే ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

కాజల్‌ అగర్వాల్‌ని తెలుగు తెరకు పరిచయం చేసింది తేజనే. అందుకే తేజ తనకు గురువులాంటి వాడని కాజల్‌ చాలా సార్లు చెప్పింది కూడా. ప్రస్తుతం కాజల్‌ చేతిలో తమిళ ‘క్వీన్‌’ సినిమా ఉంది. ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ టైటిల్‌తో ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇదిలా ఉంటే, తెలుగులో యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో కాజల్‌ నటిస్తోంది. శ్రీనివాస్‌ అనే కొత్త దర్శకుడితో రూపొందుతోన్న ఈ సినిమా ఇంకా సెట్స్‌ పైకి వెళ్లలేదు. ఈ లోగానే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి కాజల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనీ తెలుస్తోంది. 

అది తేజ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా అనే అంటున్నారు. ఓ యంగ్‌ హీరో ఈ సినిమాలో నటించనున్నాడట. అయితే ఆ యంగ్‌హీరో రానానే అని టాక్‌ గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ నుండి తేజ తప్పుకున్నాక, తన తదుపరి చిత్రం వివరాలు వెల్లడించలేదింతవరకూ. 

తాజాగా అందుతోన్న సమచారమ్‌ ప్రకారం తేజ తన కొత్త ప్రాజెక్ట్‌ని సెకండ్‌ ఇన్నింగ్స్‌లో తనకు లక్కీ అయిన జంటతోనే స్టార్ట్‌ చేయనున్నాడనీ తెలుస్తోంది. అది ఇంకెవరు? రానా – కాజల్‌నే. సో ఈ టాక్‌ నిజమే అయితే, రానాతో మరోసారి చందమామ జోడీ కట్టనుందన్న మాటే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular