HomeMovie News Teluguత్రిష ఎందుకు వదిలేసింది 'సామీ'!

త్రిష ఎందుకు వదిలేసింది ‘సామీ’!

విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతోన్కన చిత్రం ‘సామీ – 2’. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. హరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. అయితే ఇందులో మరో హీరోయిన్‌గా నటిస్తున్న త్రిష, ఈ సినిమా నుండి తప్పుకుంది. ఇందుకు అనేక గాసిప్స్‌ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇదే విషయం త్రిషని అడిగితే, క్రియేటివ్‌ కారణాల దృష్ట్యా ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పింది. కానీ బయట ప్రచారం అవుతున్న గాసిప్స్‌ మరోలా ఉన్నాయి.

హీరోయిన్‌ కీర్తి సురేష్‌కీ, త్రిషకీ మధ్య విబేధాలు రావడంతోనే ఈ సినిమా నుండి త్రిష తప్పుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే హీరో విక్రమ్‌కీ, త్రిషకీ మధ్య డిఫరెన్సెస్‌ వల్ల ఈ సినిమా వదులుకుంది త్రిష అంటూ మరో ప్రచారం జరుగుతోంది. కాదు డైరెక్టర్‌కీ, త్రిషకి సఖ్యత కుదరకే ఈ సినిమాను త్రిష పక్కన పెట్టేసిందనీ మరో గాసిప్‌ వినిపిస్తోంది. అసలింతకీ వీటిలో ఏది నిజమన్నది తెలీదు. మరో పక్క త్రిష చేతిలో చాలా సినిమాలున్నాయి. షెడ్యూల్స్‌ మేనేజ్‌ చేయలేక త్రిష ఈ సినిమాని వదులుకున్నాననీ చెబితే అది వేరే విషయం.

కానీ ‘క్రియేటివ్‌ సమస్యలు’ కారణం అనడంతో అసలు త్రిషని ఎవరు ఇబ్బంది పెట్టారో అంటూ ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలింతకీ త్రిషని ఇబ్బంది పెట్టిన ఆ క్రియేటివ్‌ సమస్యలు ఏంటో కానీ, ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాకి త్రిష ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది. తాను తప్పుకున్నప్పటికీ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్న త్రిషని అభినందించాలి. కాగా త్రిష ప్రస్తుతం పలు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular