HomeMovie News Teluguవావ్‌ చరణ్‌ సెన్సేషన్‌ సృష్టించేస్తాడేమో!

వావ్‌ చరణ్‌ సెన్సేషన్‌ సృష్టించేస్తాడేమో!

సుకుమార్‌ చిత్రాలు చాలా విభిన్నంగా ఉంటాయి. అది అందరికీ తెలుసు. ఎంత విభిన్నంగా ఉన్నా, మరీ హీరోని పల్లెటూరి కుర్రాడిలా చూపించడమంటే కొంచెం కష్టమే. అది కూడా సరిగ్గా వినపడని యువకుడి పాత్రలో చరణ్‌ నటించడమంటే అభిమానులు ఎలా జీర్ణించుకుంటారోననే సందేహం ఉంటుంది. అయితే అవన్నీ పక్కన పెట్టి, సుకుమార్‌ – చరణ్‌తో రిస్క్‌ చేస్తున్నాడు. ఈ సినిమా కోసమే రామ్‌చరణ్‌ తొలిసారిగా పూర్తి గడ్డంతో కనిపిస్తున్నాడు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

అలాగే కొల్లేరు ప్రాంతంలో కూడా షూటింగ్‌ జరుపుతున్నారు. షూటింగ్‌ స్పాట్‌ నుంచి కొన్ని ఫొటోలు విడుదలవుతున్నాయి. కొన్ని ఫొటోలు లీక్‌ అవుతోంటే, ఇంకొన్ని అధికారికంగా సోషల్‌ మీడియాలో విడుదల చేస్తున్నారు. రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ఇటీవలే ఓ ఫొటో విడుదల చేసింది. లేటెస్ట్‌గా సుకుమార్‌ – చరణ్‌ కలిసి ఉన్న ఫొటో ఒకటి బయటకొచ్చింది. సెట్స్‌లో చరణ్‌ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

తండోపతండాలుగా వస్తున్న అభిమానులతో షూటింగ్‌ ప్రాంతంలో ఒకటే సందడి. ఆ సందడిని చూస్తే, చిత్ర యూనిట్‌లో కొత్త ఉత్సాహం వస్తోందట. ఇంకో వైపున లొకేషన్స్‌ చూసి చిత్ర బృందం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇవన్న పరిశీలిస్తే చరణ్‌ – సుకుమార్‌ డైరెక్షన్‌లో చేయబోయే సినిమాతో సరికొత్త సెన్సేషన్‌ సృష్టించేస్తాడేమో అనిపించడం అతిశయోక్తి కాదు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular