HomeMovie News Teluguయుద్ధానికి సిద్ధమవుతున్న శృతిహాసన్‌

యుద్ధానికి సిద్ధమవుతున్న శృతిహాసన్‌

అందాల భామ శృతిహాసన్‌ యుద్ధానికి సిద్ధమవుతోంది. సి సుందర్‌ దర్శకత్వంలో ‘సంఘమిత్ర’ అనే సినిమాలో నటిస్తోంది శృతిహాసన్‌. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం శృతిహాసన్‌ ప్రమాదకరమైన యుద్ధ విద్యల్లో శిక్షణ పొందుతోంది. సినిమా కోసం కమల్‌హాసన్‌ ఎంత డెడికేషన్‌ ప్రదర్శిస్తారో అందరికీ తెలుసు. ఆయన కుమార్తె శృతిహాసన్‌ కూడా అంతే. బాలీవుడ్‌లో ఇప్పటికే యాక్షన్‌ సినిమా చేసిన అనుభవం ఉన్న శృతిహాసన్‌కి మార్షల్‌ ఆర్ట్స్‌లో కొంత ప్రావీణ్యం ఉంది.

దాన్ని, ‘సంఘమిత్ర’ సినిమా కోసం కొంత మేర వినియోగిస్తుందట. అలాగే కత్తి యుద్ధాల్లో శిక్షణ తీసుకుంటూ, ‘సంఘమిత్ర’ చిత్రాన్ని తన కెరీర్‌లోనే ఓ మైలురాయిగా మలచుకోవాలనుకుంటోంది శృతిహాసన్‌. ఈ సినిమా కోసమే బాగా సన్నబడిందట కూడా. మొన్నీమధ్యన తెలుగులో వచ్చిన ‘కాటమరాయుడు’ సినిమాలో శృతిహాసన్‌ కొంత బొద్దుగా కనిపించింది. అయితే ఇప్పుడు సన్నబడి, సరికొత్తగా యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం పొందుతూ, మునుపటి గ్లామర్‌ని సొంతం చేసుకుంది శృతిహాసన్‌.

జయం రవి, ఆర్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. ‘బాహుబలి’ తరహాలో ఈ ‘సంఘమిత్ర’ చిత్రం ఉండబోతోందట. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ‘సంఘమిత్ర’ చిత్రాన్ని విడుదల చేస్తారు. సంగీత సంచలనం ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular