HomeMovie News Teluguమెగా మల్టీస్టారర్‌ హుష్‌ కాకేనా?

మెగా మల్టీస్టారర్‌ హుష్‌ కాకేనా?

చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ కలిసి నటిస్తారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అందుకే దాన్ని మెగా మల్టీస్టారర్‌గా అంతా పరిగణించారు. ఈ కాంబినేషన్‌లో సినిమాను తెరకెక్కిస్తానని ప్రముఖ రాజకీయ వేత్త, నిర్మాత అయిన సుబ్బిరామిరెడ్డి అఫీషియల్‌గా ప్రకటన కూడా చేసేశారు. అయితే ఈ చిత్రం తెరకెక్కించాలనే ఆలోచనను సుబ్బరామిరెడ్డి విరమించుకున్నారని సమాచారమ్‌. చిరంజీవి డేట్స్‌ ఖాళీ లేకపోవడం, అలాగే పవన్‌కళ్యాణ్‌ కూడా ఖాళీగా లేకపోవడంతో మెగా మల్టీస్టారర్‌ అటకెక్కినట్లే భావించాలి.

ఈ సమాచారం తెలిసి ఫ్యాన్స్‌ చాలా డిజప్పాయింట్‌ అయ్యారు. కానీ మరోపక్క పవన్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళింది. ఈ సినిమా త్వరలోనే షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే చిరంజీవి, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా చేయబోతున్నారు. త్రివిక్రమ్‌ తర్వాత పవన్‌, నేసన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. ఇవన్నీ అవ్వాలంటే చాలా టైమే పడుతుంది.

ఒకవేళ ఆ తర్వాత కూడా చిరు, పవన్‌ డేట్స్‌ ఇస్తారనే నమ్మకం సుబ్బిరామిరెడ్డికి కలగడంలేదు. అందుకే ఆయన ఆ ప్రాజెక్ట్‌ని విరమించుకున్నారని తెలియవస్తోంది. మొత్తానికి ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే ఓ సెన్సేషనే అనుకున్నారంతా. కానీ అది జరగదని తెలిసేసరికి నిరాశ పడడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular