HomeMovie News Teluguపంతులుగారూ ఫైట్‌ అదరగొట్టేశారూ!

పంతులుగారూ ఫైట్‌ అదరగొట్టేశారూ!

ఈ పంతులు మంత్రాలు వల్లె వేయడమే కాదండోయ్‌.. ఫైట్లు కూడా ఆదరగొట్టేస్తాడు. గెటప్‌తో సంబంధం లేదు తలచుకున్నాడంటే చితక్కొట్టుడే. ఎవరి గురించనుకుంటున్నారా? స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. ఆయన హీరోగా ‘డీజె – దువ్వాడ జగన్నాధమ్‌’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హరీష్‌ శంకర్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజు అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘దువ్వాడ జగన్నాధమ్‌’ సినిమా నుండి ఓ పోస్టర్‌ విడుదల చేసి అల్లు అర్జున్‌కి బర్త్‌డే విషెస్‌ చెప్పాడు.

ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్‌ ఎప్పటిలాగే సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ బ్రాహ్మణ యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇదో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ. గెటప్‌ పంతులుగారిదే అయినా కానీ యాక్షన్‌ కూడా మెండుగా ఉంటుందట. ఈ విషయం ఇప్పటికే విడుదలైన టీజర్‌ ద్వారా ప్రూవ్‌ అయ్యింది. రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో అల్లు అర్జున్‌ కనిపించబోతున్నాడు. ముద్దుగుమ్మ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో.

‘ముకుందా’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించిన ఈ భామ, తాజా సినిమా ‘దువ్వాడ జగన్నాధమ్‌’తో గ్లామరస్‌ యాంగిల్‌ చూపించబోతోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనం కూడా అల్లు అర్జున్‌కి బర్త్‌డే విషెస్‌తో పాటు ఆల్‌ ది బెస్ట్‌ కూడా చెప్పేద్దాం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular