HomeMovie News Teluguరేపే ప్రేక్షకుల ముందుకి 'బాహుబలి'

రేపే ప్రేక్షకుల ముందుకి ‘బాహుబలి’

రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘బాహుబలి ది బిగినింగ్‌’ సినిమా. ఈ సినిమా వచ్చి రెండేళ్లయినా కానీ ఇప్పటికీ ఈ సినిమా మేనియా ఏమాత్రం తగ్గలేదు జనంలో. త్వరలోనే ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ రాబోతోంది. బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడు? అనే దగ్గర ఆగిపోయింది ‘బాహుబలి ది బిగినింగ్‌’ స్టోరీ. ఇక రెండో పార్ట్‌లోనే అసలు స్టోరీ అంతా ఉంది. మొదటి పార్ట్‌ కేవలం పాత్రల పరిచయాలు మాత్రమే. పాత్రల పరిచయంతో మొదలైన మొదటి పార్ట్‌ని మళ్లీ ఇప్పుడు తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది ‘బాహుబలి’ అండ్‌ టీమ్‌.

సెలెక్ట్‌డ్‌ ధియేటర్స్‌లో ఈ సినిమాని రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల సినిమాకి కనెక్టింగ్‌ ఉంటుంది. ఇప్పటికే ఈ రెండో పార్ట్‌కి సంబంధించి పలు రకాలుగా ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ హైద్రాబాద్‌లో ఘనంగా జరిగింది. రాజమౌళి సోషియో ఫాంటసీ చిత్రంగా అత్యద్భుతంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. తెలుగు సినిమా చరిత్రని దేశ దేశాల చాటి చెప్పిన చిత్రం కూడా ఇదే.

ప్రబాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోంది ఈ చిత్రం. విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా మొదటి పార్ట్‌ని మించి ఈ పార్ట్‌లో ఉండబోతున్నాయట. కీరవాణి సంగీత సారధ్యంలో ఆకట్టుకునే మ్యూజిక్‌ ఈ సినిమాకి సమకూర్చారు. ఏప్రిల్‌ నెలాఖరున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందాకా ఒక్కసారి ఫస్ట్‌ పార్ట్‌ చూసి మరోసారి తరిద్దామా మరి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular