HomeMovie News Telugu'మెగా' కలయిక ఎప్పుడో!

‘మెగా’ కలయిక ఎప్పుడో!

మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబం నుంచి ఎందరో హీరోలున్నారు, నిర్మాతలున్నారు. అయితే ఈ మధ్య మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలంటూ తరచూ వార్తలు వినవస్తుండడంతో అభిమానులలో కొంత ఆందోళన కనిపిస్తోంది. చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి పవన్‌కళ్యాణ్‌ హాజరు కాకపోవడం, ‘కాటమరాయుడు’ సినిమా ఫంక్షన్‌లో ఒక్కరంటే ఒక్కరు మెగా కాంపౌండ్‌ నుంచి ఎవరూ కనిపించకపోవడంతో అభిమానుల ఆవేదన అర్థం చేసుకోదగ్గదే.

కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు. అదే విధంగా ఇతరత్రా విషయాలూ అందరూ ఒకే వేదికపై కనిపించకపోవడానికి కారణం కావొచ్చు. ఇతరత్రా విషయాలంటే వేర్వేరు పనులతో బిజీగా ఉండడం. అయినప్పటికీ కూడా తమ అభిమాన హీరోలందరినీ ఒకే వేదికపై చూడాలని అభిమానులు ఆశపడటంలో తప్పు లేదు కదా! నిన్న రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులను ఉద్దేశించి సాయిధరమ్‌తేజ్‌ ఓ అప్పీల్‌ చేశాడు. అభిమానులంతా ఒక్కటిగా ఉండాలనీ, తమ కుటుంబమంతా కలిసే ఉంది గనుక, విభేదాలంటూ వచ్చే వార్తలని విశ్వసించరాదని చెప్పాడు.

అయితే ఈ అప్పీల్‌ చిరంజీవి, పవన్‌స్థాయిలో ఉంటే మంచిది. చిరంజీవి నుంచి అప్పీల్స్‌ వస్తూనే ఉన్నాయి. పవన్‌కళ్యాణ్‌ నుంచే కొంత గందరగోళం కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఏదన్నా ఓ వేదికపై అంతా ఒక్కసారి కలిస్తే వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పడుతుంది. కానీ ఇదివరకు పలుసార్లు స్పష్టత ఇచ్చినప్పటికీ వివాదాలు కొనసాగుతుండడంతో మళ్ళీ మళ్ళీ వివరణ ఎందుకు? అనే ఆలోచనలో మెగా కాంపౌండ్‌ ఉండటం కూడా కరెక్టే కావొచ్చు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular