HomeMovie News Teluguకాకా టైటిల్ గ్లింప్స్.. చిరంజీవి వింటేజ్ మాస్ లుక్ అదుర్స్!

కాకా టైటిల్ గ్లింప్స్.. చిరంజీవి వింటేజ్ మాస్ లుక్ అదుర్స్!

వాల్తేరు వీరయ్య తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. మెగా-158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ అప్‌డేట్ వచ్చేసింది.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘కాకా’ అనే పవర్‌ఫుల్, వింటేజ్ టచ్ ఉన్న టైటిల్‌ను ఖరారు చేస్తూ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. టైటిల్‌తో పాటు గ్లింప్స్‌లో చిరంజీవి లుక్, యాక్షన్ సీన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

గ్లింప్స్ విషయానికి వస్తే.. ఆక్వా రంగానికి చెందిన ‘కె. సత్యం’ అనే సూపర్‌వైజర్ పాత్రలో చిరంజీవి పరిచయం అవుతారు. చెన్నై టీమ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ లోడ్ సకాలంలో చేరుతుందని హామీ ఇవ్వడం, పండుగ టార్గెట్ పేరుతో సునీల్ అడిగిన సెలవును తిరస్కరించడం వంటి సహజమైన సన్నివేశాలతో వీడియో ఆసక్తికరంగా సాగుతుంది.

అయితే గెటప్ శ్రీను విసిరిన స్కూటర్ కీస్ నీటిలో పడిపోవడం, వాటిని ఓ రిమోట్ మాగ్నెట్ సాయంతో బయటకు తీసే సమయంలో లోపలి నుంచి తుపాకులు బయటపడటం గ్లింప్స్‌లో ఊహించని ట్విస్ట్‌ను అందించింది. కళ్లద్దాలతో మధ్య వయస్కుడైన శాంతమూర్తిగా కనిపించిన చిరంజీవి వెంటనే ‘కాకా’ టైటిల్ రివీల్‌తో మాస్ టచ్‌లోకి మారడం అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

ఆ తర్వాత వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో గన్స్ పేలుస్తూ చిరంజీవి ఇచ్చిన వింటేజ్ మాస్ పోజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థమన్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు మరింత ఎనర్జీని తీసుకొచ్చింది.

కెవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘కాకా’ సినిమాను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తో మెగా అభిమానుల్లో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular