మాస్ మహారాజా రవితేజకు చాలాకాలంగా సరైన బ్లాక్‌బస్టర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ‘ఇరుముడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విడుదలకు ముందే ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడగా, థియేటర్లలో కూడా సినిమాకు పాజిటివ్ టాక్ లభించినట్లు తెలుస్తోంది. దీంతో తొలిరోజు మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి.
అంతేకాకుండా ‘ఇరుముడి’ ఓ విషయంలో రీజినల్ తెలుగు సినిమాల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. బుక్‌మైషోలో గంటకు అత్యధిక టికెట్లు అమ్ముడైన తెలుగు సినిమాల జాబితాలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం 31.6K టికెట్ల సేల్స్‌తో ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉన్నట్లు సమాచారం.
తాజాగా ‘ఇరుముడి’ సినిమా ఒక్క గంటలోనే ఏకంగా 32.25K టికెట్లు విక్రయించుకుని ఆ రికార్డును అధిగమించినట్లు తెలుస్తోంది. దీంతో బుక్‌మైషోలో గంటకు అత్యధిక టికెట్లు సేల్ చేసిన రీజినల్ తెలుగు చిత్రంగా ‘ఇరుముడి’ మొదటి స్థానంలో నిలిచినట్లు మూవీ టీమ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ అరుదైన రికార్డు రవితేజ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. చాలాకాలం తర్వాత తమ హీరోకు మంచి హిట్ దక్కుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
కాగా, ‘ఇరుముడి’ చిత్రంలో ప్రియ భవాని శంకర్ కథానాయికగా నటించగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.





