టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన చిన్నారి అభిమాని శశిభవ్యతకు అండగా నిలిచి, ఆమె కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హృదయాలను హత్తుకుంటోంది.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలానికి చెందిన శశిభవ్యత కొంతకాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. అయితే ఆమెకు హీరో రామ్ పోతినేనిపై అపారమైన అభిమానం ఉంది. రామ్ ఫొటో చూపిస్తేనే ఆహారం తీసుకుంటుందని, మందులు వేసుకుంటుందని ఇటీవల వైరల్ అయిన వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఈ వీడియోలు చూసిన రామ్ వెంటనే స్పందించారు. బుధవారం వీడియో కాల్ ద్వారా చిన్నారితో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే స్వయంగా వచ్చి కలుస్తానని హామీ ఇచ్చారు. అలాగే సమయానికి భోజనం చేయాలని, మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆప్యాయంగా సూచించారు.
అంతేకాకుండా, శశిభవ్యత చికిత్సకు అవసరమైన వైద్య ఖర్చులు, మందులు, ఆహార వ్యయాలను తానే భరిస్తానని రామ్ ప్రకటించినట్లు సమాచారం. దీంతో తీవ్ర ఆందోళనలో ఉన్న చిన్నారి కుటుంబానికి ఆయన అండగా నిలిచారు.
రామ్ చేసిన ఈ మానవత్వపూరిత సహాయంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెరపై హీరోగా అలరించే రామ్, నిజ జీవితంలో కూడా రియల్ హీరో అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది.
Our @ramsayz Anna connected with his beloved fan Shashi over a video call, offering strength and reassurance during his health battle. ❤️
— Hari Ram (@Hariramhere) August 19, 2026
And assured Shashi that he would stand by him and support his medical needs. A beautiful gesture that truly reflects the heart of a star🙏❤️ pic.twitter.com/waErBXJOgQ





