HomeMovie News Teluguరామ్ చరణ్ బాడీగార్డ్ ఇప్పుడు ఆస్టార్ హీరోతో..

రామ్ చరణ్ బాడీగార్డ్ ఇప్పుడు ఆస్టార్ హీరోతో..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి తరచూ కనిపిస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షించిన బాడీగార్డ్ కెవిన్ కుంటా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్, పబ్లిక్ ఈవెంట్ల సమయంలో రామ్ చరణ్‌కు సెక్యూరిటీగా వ్యవహరించిన కెవిన్, తన అప్రమత్తతతో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

ముఖ్యంగా ఓ ఈవెంట్‌లో రామ్ చరణ్ వైపు దూసుకొచ్చిన అభిమానిని వెంటనే అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో కెవిన్ వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఆ ఘటన తర్వాత ఆయన పేరు కూడా సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది.

అయితే తాజాగా అక్కినేని నాగార్జున పాల్గొన్న ఓ కార్యక్రమంలో కెవిన్ కనిపించడంతో కొత్త చర్చ మొదలైంది. దీంతో ఆయన రామ్ చరణ్ టీమ్‌ను విడిచి నాగార్జునకు సెక్యూరిటీగా పనిచేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా, కెవిన్ నాగార్జునతో కనిపించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు కూడా ఈ మార్పుపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, ప్రముఖ సెలబ్రిటీలకు సెక్యూరిటీ అందించే కెవిన్ కుంటా రోజుకు లక్షల్లో పారితోషికం తీసుకుంటారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. ప్రయాణాలు, ప్రత్యేక ఈవెంట్లు, షూటింగ్‌ల సమయంలో ఆయన సేవలకు భారీ డిమాండ్ ఉన్నట్లు సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular