కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డీసీ’ (DC) ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. విలక్షణ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో వామికా గబ్బి కథానాయికగా నటించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఆగస్టు 7న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అరుణ్ మాథేశ్వరన్ ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్, లోకేష్ కనగరాజ్ నటన, అనిరుధ్ అందించిన పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “డీసీ చాలా ఒరిజినల్, అవుట్‌స్టాండింగ్ సినిమా. సినిమా మొత్తం ఎంతో ఆసక్తిగా చూసాను. ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదించాను. దర్శకుడు, నటీనటులు, సాంకేతిక బృందానికి హృదయపూర్వక అభినందనలు” అంటూ ఆయన పోస్ట్ చేశారు.
మహేష్ బాబు చేసిన ఈ ప్రశంసలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ నుంచి ఇలాంటి స్పందన రావడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మహేష్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
దర్శకుడిగా ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన లోకేష్ కనగరాజ్, ఈ సినిమాతో నటుడిగానూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ‘డీసీ’ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
#DC… what an original and outstanding film 👏🏻👏🏻👏🏻 Just too cool… 😎😎😎 Loved every bit of it!! Congrats to the entire team…🤗🤗❤️❤️@Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial #WamiqaGabbi @isanjkayy @mukesh_DOP @editor_prasanna @skannanartdir @sunpictures
— Mahesh Babu (@urstrulyMahesh) August 16, 2026





