HomeMovie News Teluguదిల్జిత్ దోసాంజ్ సత్లుజ్ కు కేంద్రం షాక్..

దిల్జిత్ దోసాంజ్ సత్లుజ్ కు కేంద్రం షాక్..

ప్రముఖ నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ నటించిన ‘సత్లుజ్’ సినిమా వివాదంలో చిక్కుకుంది. పంజాబ్‌కు చెందిన ఓ మానవ హక్కుల కార్యకర్త అదృశ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని కంటెంట్‌పై అభ్యంతరాలు వ్యక్తమవడంతో, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) కీలక నిర్ణయం తీసుకుంది. తాజా ఆదేశాల ప్రకారం, ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 నుంచి తక్షణమే తొలగించాలని కేంద్రం సూచించినట్లు సమాచారం.

అంతేకాకుండా, సినిమాలోని వివాదాస్పద అంశాలను సమగ్రంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంటర్-డిపార్ట్‌మెంటల్ కమిటీ (IDC) ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కమిటీ సినిమా కథాంశం, వివాదాస్పద సన్నివేశాలు, వాటి సామాజిక ప్రభావం, అలాగే దేశ భద్రత, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలను సమీక్షించనుంది.

కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా ఈ చిత్రాన్ని మళ్లీ ఓటీటీలో ప్రసారం చేయాలా? లేక మరిన్ని చర్యలు తీసుకోవాలా? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘సత్లుజ్’ సినిమా చుట్టూ నెలకొన్న వివాదం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ అంశంపై చిత్రబృందం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular