అక్కినేని అఖిల్ హీరోగా.. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఈసారి ప్రచార కార్యక్రమాలను మరింత ప్రత్యేకంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో అఖిల్‌కు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ ఇంటర్వ్యూలో నాగార్జున కూడా పాల్గొనే అవకాశం ఉందని టాక్.
అఖిల్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు ఒకే వేదికపై కనిపిస్తే సినిమాపై మరింత బజ్ క్రియేట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. దీంతో ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే, ఈ ప్రత్యేక ఇంటర్వ్యూకు సంబంధించి చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ వార్తలు సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఆధారంగానే ఉన్నాయి. అయినప్పటికీ, ‘లెనిన్’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కొనసాగుతున్నాయి.





