దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా బాహుబలి అభిమానులకు మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ పేరుతో కొత్త ప్రాజెక్ట్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. బాహుబలి-3 రానుంది అంటూ ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ ప్రకటనకు సంబంధించి పూర్తి వివరాలు, కథ, విడుదల తేదీ వంటి అంశాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఈ వీడియో బయటకు రావడంతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. బాహుబలి ఫ్రాంచైజీ మరోసారి తెరపైకి రానుందనే వార్తతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, సలార్-2, కల్కి-2, ఫౌజీ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్ల కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి-3 పై పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉండగా, ప్రభాస్ చేసిన తాజా ప్రకటన మాత్రం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.





