HomeMovie News Teluguస్పిరిట్ లో ప్రభాస్ లుక్ అదిరింది

స్పిరిట్ లో ప్రభాస్ లుక్ అదిరింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ ప్రాజెక్టులలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

తాజాగా స్పిరిట్ సెట్స్‌ నుంచి ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్ చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. లీకైన ఫొటోలో ప్రభాస్ ట్రెడిషనల్ పంచెకట్టులో కనిపిస్తూనే, చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్‌గా దర్శనమిచ్చారు. పొడవాటి జుట్టు, కళ్లకు గాగుల్స్‌తో ఆయన లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ లుక్ చూస్తుంటే సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌ను ఈసారి పూర్తి భిన్నమైన మాస్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పంచెకట్టు, గన్ కాంబినేషన్‌లో ప్రభాస్ కనిపించడం ఫ్యాన్స్‌కు కొత్త ఫీల్ ఇస్తోందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఏమున్నాడ్రా బాబు, ఈసారి బాక్సాఫీస్ పూనకాలే, డార్లింగ్ లుక్ నెక్స్ట్ లెవెల్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొనగా.. ఇప్పుడు లీకైన ఈ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మొత్తానికి, స్పిరిట్ నుంచి బయటకు వచ్చిన ప్రభాస్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular