HomeMovie News Teluguపెళ్లి మోసం ఆరోపణలు.. హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి

పెళ్లి మోసం ఆరోపణలు.. హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి

టాలీవుడ్ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అషురెడ్డి తనపై నమోదైన క్రిమినల్ కేసును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. లండన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వై.వి. ధర్మేంద్ర ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు ఆమెపై, ఆమె కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

తనపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు కనీసంగా వివరణ కూడా కోరకుండా కేసు నమోదు చేశారని అషురెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని, అందుకే కేసును వెంటనే కొట్టివేయాలని (క్వాష్ చేయాలని) కోర్టును అభ్యర్థించారు.

అలాగే అసలు వాస్తవాలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, 2018 నుంచి అషురెడ్డితో ధర్మేంద్రకు పరిచయం ఉందని తెలిపారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి సుమారు రూ.9.35 కోట్లు నగదు, 5 కేజీల బంగారం, విలాసవంతమైన కార్లు, ప్లాట్లు వసూలు చేసిందని ఆరోపించారు. పెళ్లి విషయంపై ప్రశ్నించగా ఆత్మహత్య చేస్తానని బెదిరించడంతో పాటు, తప్పుడు కేసులు పెడతానని కూడా భయపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉండగా, అషురెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి టాలీవుడ్ వర్గాల్లో నెలకొంది.

మొత్తానికి, ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular