HomeMovie News Teluguఒకే రోజు ఓటీటీలో రెండు క్రేజీ సినిమాలు

ఒకే రోజు ఓటీటీలో రెండు క్రేజీ సినిమాలు

ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులకు కొత్త సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈసారి ఒకే రోజు, ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రెండు క్రేజీ తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌కు రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఈ రెండు సినిమాల స్ట్రీమింగ్ తేదీలను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

శర్వానంద్ హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్‌గా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బైకర్’ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ఈ చిత్రాన్ని మే 1వ తేదీ నుంచి తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.

సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా, మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన ‘రాకాస’ సినిమా డిజిటల్ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.

ఈ సినిమాను కూడా మే 1వ తేదీ నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఒకే రోజు రెండు కొత్త సినిమాలు అందుబాటులోకి వస్తుండటంతో మూవీ లవర్స్‌లో ఆసక్తి పెరిగింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ రెండు సినిమాలను ఎంజాయ్ చేయొచ్చు.

మొత్తానికి మే 1న నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular