ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి కీలక సమాచారం ఇచ్చారు. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
ఇటీవల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వెంటనే స్పందించిన సిబ్బంది ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు అవసరమైన శస్త్రచికిత్స ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్న సమయంలో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
కళ్యాణ్ బాబుకు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షేమంగా, నిలకడగా ఉంది. వేగంగా కోలుకుంటున్నారు. వైద్యుల సూచనల ప్రకారం ఆయన మళ్లీ సాధారణ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సుమారు వారం రోజులు పట్టవచ్చు. కాబట్టి అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చిరంజీవి తెలిపారు.
పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి ఆరోగ్యంతో ఆయన తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు.
మెగాస్టార్ ఇచ్చిన ఈ స్పష్టతతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ మళ్లీ తన కార్యక్రమాల్లో పాల్గొంటారని జనసైనికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Kalyan Babu has successfully undergone a medical procedure and is now safe, stable, and recovering well.
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 19, 2026
As per the doctors, it may take about a week for him to return to his normal routine. There is no cause for concern.
Thank you all for your love, concern, and prayers. Let…





