HomeTeluguఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ & రేటింగ్

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ & రేటింగ్

చిత్రం: ఉస్తాద్ భగత్ సింగ్
దర్శకత్వం: హరీష్ శంకర్
కథ : హరీష్ శంకర్
స్క్రీన్ ప్లే : దశరథ్

నటీనటులు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శ్రీలీల, రాశీ ఖన్నా, సాక్షి వైద్య, అశుతోష్ రానా, అలీ, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర, పార్థిబన్, టెంపర్ వంశీ తదితరులు.

నిర్మాతలు: నవీన్ యెర్నేని , వై రవి శంకర్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్
ఎడిటర్: చోటా కె ప్రసాద్

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
విడుదల తేదీ: 19 మార్చి 2026

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. గత ఏడాది హరి హర వీరమల్లు , ఓజీ సినిమాలతో హిట్స్ అందుకున్న పవన్ తెలుగు కొత్త సంవత్సరాదిన ఉస్తాద్ భగత్ సింగ్ గా థియేటర్స్ లో సందడి చేస్తూ ఫాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు. పవన్ కి గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ అందించిన హరీష్ శంకర్ ఉస్తాద్ ని డైరెక్ట్ చేసారు . పవన్ డై హార్ట్ ఫ్యాన్ అయిన హరీష్ దర్శకత్వం వహించటం, గబ్బర్ సింగ్ కాంబో కావటంతో ఉస్తాద్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రయిలర్, పాటలు మరింత హైపుని పెంచాయి. పవన్ ఫాన్స్ గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఖాయమని ఫిక్స్ అయిపోయారు. మరి ఉగాది కానుకగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎలా ఉందొ ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

ప్రజలకోసం తపిస్తూ , మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఒక మాస్టారు (కేఎస్ రవికుమార్) ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదుగుతారు. సీఎం పీఠం కోసం పోటీతో సీఎం పై హత్యా ప్రయత్నం జరుగుతుంది. గాయపడ్డ సీఎం ట్రీట్ మెంట్ కోసం సింగపూర్ వెళ్తారు. దీనితో నల్ల నాగప్ప (పార్థిబన్) ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎంపికవుతాడు. అదే టైంలో ఫారెస్ట్ ఏరియాకి వెళ్లిన అతని కుమారుడు (కిల్లి క్రాంతి) ని పోలీస్ ఆఫీసర్ ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్) బందీగా చేస్తాడు . రాష్ట్ర సీఎం కొడుకుని ఉస్తాద్ బందీ చేయటం సెన్సేషన్ గా మారుతుంది. కొడుకుని ఎలా అయినా తీసుకురావాలనే పంతంతో సీఎం నాగప్ప టెర్రరిస్టుల సాయం తీసుకుంటాడు. ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి టెర్రరిస్టుల సాయం తీసుకోవటం ఏంటి ? నాగప్ప కి టెర్రరిస్ట్స్ తో సంబంధం ఏంటి ? ఉస్తాద్ సీఎం కొడుకుని ఎందుకు అరెస్ట్ చేసాడు ? హత్యాయత్నానికి గురైన ముఖ్యమంత్రికి, భగత్ సింగ్ కి ఉన్నసంబంధం ఏంటి ? ఈ విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

‘ఉస్తాద్ భగత్ సింగ్’ కథ పై మొదటి నుంచి రక రకాలుగా ప్రచారం జరుగుతోంది. ‘తేరి’ రీమేక్ అని ఆపరేషన్ సింధూర్ కథ అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ చివరికి ఇది తేరి రీమేక్ కాదని సినిమా చూస్తే అర్థం అవుతుంది. కాకపోతే తేరి లో విజయ్ పొలిసు ఆఫీసర్ గా సాల్వ్ చేసిన రేప్ కేసు వలన ఫ్యామిలీ ని కోల్పోతాడు. ఉస్తాద్ లో కూడా పవన్ రేప్ కేసు సాల్వ్ చేయటం వలన ఫ్యామిలీని కోల్పోతాడు. ఇప్పటికే ఓజీ మూవీతో ఫాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చిన పవన్ ఉస్తాద్ తో మరో సారి పండగ వైబ్రేషన్స్ పెంచారు. ఫాన్స్ నమ్మకాన్ని ఉస్తాద్ వమ్ము చేయలేదు. కథ, కథనం కొత్తగా లేకపోయినా, రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయినా ఫాన్స్ కి మాత్రం ఫుల్ జోష్ తెచ్చింది ఉస్తాద్. ఓపెనింగ్ సీన్ నుంచి సినిమాపై ఆసక్తి పెంచారు దర్శకుడు హరీష్ శంకర్. పవన్ జీవితాన్నిపరిచయం చేస్తూ సీఎం తో ఉన్న అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ కథ చివరి వరకు ట్విస్ట్ రివీల్ చేయకుండా చాక చక్యంగా నడిపించాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే పై మరింత ద్రుష్టి పెట్టి ఉంటె బాగుండేది. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, పవన్ డాన్స్, స్టైలిష్ లుక్ ఫాన్స్ ని ఫుల్ గా అలరిస్తాయి. నీటి నిజాయితీ గల ఒక పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ గా పవన్ ఆకట్టుకున్నారు. కానీ గబ్బర్ సింగ్ స్థాయిలో మెప్పించలేకపోయారు. హరీష్ కథ కంటే పవన్ కళ్యాణ్ మ్యాజిక్ తో , స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాని నడిపించారు. ఫస్ట్ హాఫ్ స్లో గా ఉన్నా సెకండ్ హాఫ్ మెప్పిస్తుంది. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ పాటలకి కాలు కదిపి ఫాన్స్ తో విజిల్స్ వేయించారు. ఓజీ లో ఉన్నట్టు భారీ ఫాన్స్ మూమెంట్స్ హీరో ఎలివేషన్స్ లేకపోయినా ఉస్తాద్ కూడా ఫాన్స్ కి ఉగాది పచ్చడిలా అన్ని రుచులు చూపించారు. ఉస్తాద్ లో దర్శకుడు పవన్ పొలిటికల్ ఎజెండా కి చెందిన స్త్రీ రక్షణ, యాంటీ జిహాద్, దేశభక్తి, అవినీతి నిర్మూలన, సనాతన ధర్మ రక్షణ లాంటి విషయాలను ప్రస్తావించారు. అందుకనే సినిమా ఫ్లో దెబ్బతింది. కామెడీ, సీరియస్ డిస్కషన్స్ అన్నీ కలగా పులగంగా అనిపిస్తాయి. కొని చోట్ల కనెక్టవిటీ కూడా మిస్ అయ్యింది. సంబంధం లేని సీన్స్ వలన ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవలేరు . పవన్ ,శ్రీ లీల కాంబో సీన్స్ బాగున్నాయి. రాశి ఖన్నా కు పెద్దగా సీన్స్ లేకున్నా చూడడానికి చాలా అందం గా ఉంది. ముఖ్యంగా తొలిప్రేమ లోని ‘నీ మనస్సే’ రీమేక్ అదిరింది. ఈ పాటలో పవన్ శ్రీలీల కాలుకదిపారు. శ్రీలీల కి ఈ ఏడాది కలిసొచ్చిన సినిమాగా ఉస్తాద్ నిలుస్తుంది అనటం లో సందేహం లేదు.

నటీ నటులు:

ఉస్తాద్ భగత్ సింగ్ గా పవన్ నటన అద్భుతంగా ఉంది. పవన్ స్క్రీన్ ప్రజెన్సీ బాగుంది. సినిమా మొత్తాన్ని పవన్ తన భుజాలపై నడిపించారు. పవన్ కోసం థియేటర్స్ కి వెళ్లేవారిని డిసప్పాయింట్మెంట్ చేయలేదని చెప్పొచ్చు. ఉస్తాద్ కోసం పవన్ డాన్స్ లు కూడా చేసారు. పాలిటిక్స్ లో బిజీగా ఉన్న ఈ సినిమా కోసం శ్రద్దగా టైం కేటాయించి హార్డ్ వర్క్ చేసారని స్క్రీన్ పై తెలుస్తోంది. శ్రీ లీల ఉస్తాద్ లో అందంగా ఉంది. చాలా రోజల తరువాత శ్రీలీల కి మంచి క్యారక్టర్ పడింది. రాశి ఖన్నా పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో మెప్పించింది. అందంగా ఉంది. విలన్ గా పార్తిపన్ అలరించారు. సీఎం కొడుకు గా టెంపర్ వంశీ క్రూరంగా కనిపించి తన నటనతో మెప్పించాడు. మాష్టారుగా, సీఎం గా తమిళ సీనియర్ దర్శకుడు KS రవి కుమార్ డిగ్నిటీ గా ఉన్నారు. ఒకప్పటి తమిళ హీరో రాంకీ, గౌతమీ, LB శ్రీ రామ్ పరవాలేదనిపించారు. హిట్ ఫేమ్ శ్రీధర్ టెర్రరిస్ట్ గా మెప్పించాడు.

టెక్నికల్:

దర్శకుడిగా హరీష్ శంకర్ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయారు. కథ కథనం రొటీన్ గా ఉంది. కేవలం పవన్ ఛరిష్మా మాత్రమే ఉస్తాద్ ని నడిపించింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగుంది. పాటలు స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయ్యాయి. తమన్ అందించిన బీజీఎమ్ సినిమాకి మరింత ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ టీమ్ ఇంకొంచెం శ్రద్ద పెట్టి ఉంటె బాగుండేది. మైత్రీ మూవీ మేకర్స్ ఖర్చుకి వెనకాడకుండా రిచ్ గా తెరకెక్కించారు.

ప్లస్ పాయింట్స్

పవన్ స్క్రీన్ ప్రెజెన్స్
తమన్ బీజియం
దేవి శ్రీ పాటలు
టెక్నికల్ టీమ్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్ స్లో
స్క్రీన్ ప్లే

You May Like This
- Advertisment -spot_img

Most Popular