HomeMovie News Teluguపవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవుతారు.. పార్థిబన్!

పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవుతారు.. పార్థిబన్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తమిళ స్టార్ నటుడు ఆర్. పార్థిబన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌కు ఉన్న పట్టుదల, కష్టపడే తత్వం చూసి తాను ఆశ్చర్యపోయానని పార్థిబన్ అన్నారు.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్. పార్థిబన్ పవన్ కళ్యాణ్ గురించి ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలేదు. ఆయనలో ఉన్న పట్టుదల, ప్రజల కోసం పనిచేయాలనే తపన గొప్పది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన, భవిష్యత్తులో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవుతారు’ అని అన్నారు.

కాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో ఆర్. పార్థిబన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మొదట ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయాలని భావించినప్పటికీ, వారం రోజుల ముందుగానే రిలీజ్ చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular