కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తక్కువ కాలంలోనే తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు, మూడు సినిమాలతోనే బ్లాక్బస్టర్ హిట్లు అందుకొని ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ యంగ్ స్టార్, తాజాగా ‘డ్యూడ్’ (Dude) చిత్రంతో మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
కీర్తీశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మమిత బైజు (Mamita Baiju) హీరోయిన్గా నటించింది. దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. విడుదలైన అన్ని భాషల్లో భారీ కలెక్షన్లు రాబట్టి, బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ‘మాస్ జాతర’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చి విజయాన్ని సాధించింది.
రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ‘డ్యూడ్’ యూత్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. సినిమాకు లభించిన విజయం తర్వాత, ఇది ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Orey oru Dude, oraayiram problems, zero solutions 🤭😭 pic.twitter.com/ShfAo36IJz
— Netflix India South (@Netflix_INSouth) November 10, 2025
తాజాగా ఆ సమయం వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix) అధికారికంగా ప్రకటించింది – ‘డ్యూడ్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం సిద్ధమైందని. ఈ చిత్రం నవంబర్ 14 నుండి తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఈ సందర్భంగా ప్రదీప్ రంగనాథన్ చాక్లెట్ తింటున్న కొత్త పోస్టర్ను షేర్ చేస్తూ, “పరిష్కారం లేని సమస్యలతో.. ‘డ్యూడ్’ వస్తున్నాడు” అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.





