టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ (Allu Sirish) త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. మెగా కుటుంబానికి చెందిన శిరీష్, తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఇప్పటికే మూడు నాలుగు రోజులుగా వస్తున్న పెళ్లి వార్తలకు చెక్ పెడుతూ, ఆయన స్వయంగా ఓ నోట్‌తో పాటు ఫొటోను షేర్ చేశాడు. ఇందులో తన ప్రేయసి నైనికాతో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్టు వెల్లడించాడు. ఫ్రాన్స్‌లోని ప్రసిద్ధ ఐఫిల్ టవర్ వద్ద నైనికా చేతిని పట్టుకుని కనిపించిన ఫొటోను షేర్ చేసినా, ఆమె ముఖం మాత్రం రివీల్ చేయలేదు.
“నేడు మా తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా, నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. అక్టోబర్ 31న నేను నైనికాతో నిశ్చితార్థం చేసుకోబోతున్నాను. మా నానమ్మ ఎప్పుడూ నా పెళ్లి చూడాలని కోరుకునేది. ఇప్పుడు ఆమె మా మధ్య లేనప్పటికీ, పైనుంచి ఆశీర్వదిస్తుందని నమ్ముతున్నాను. మా కుటుంబాలు మా ప్రేమను ఆనందంగా ఆమోదించాయి” అని ఆయన రాసుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు, అభిమానులు శిరీష్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నైనికా హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి అని సమాచారం. కానీ ఆమె గురించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.
అందుకే ఇప్పుడు అందరి కళ్లూ అల్లు ఇంటి కాబోయే కోడలు ఎవరూ? ఆమె ముఖం ఎప్పుడు రివీల్ అవుతుందా? అనే ప్రశ్నలపైనే ఉన్నాయి.





