HomeMovie News Teluguమీసాల పిల్ల అంటూ చిరంజీవి.. కొత్త సాంగ్ ప్రోమో అదిరింది!

మీసాల పిల్ల అంటూ చిరంజీవి.. కొత్త సాంగ్ ప్రోమో అదిరింది!

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రయూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా, దసరా సందర్భంగా ‘మీసాల పిల్ల’ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. నెటిజన్లు “ప్రోమోనే ఇంత బావుంటే, ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ పాటను ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ ఆలపించగా, భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. భీమ్స్‌ సంగీతం సమకూర్చారు. ప్రోమోలో చిరంజీవి, హీరోయిన్ నయనతారను ఆటపట్టించే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక పూర్తి సాంగ్‌ త్వరలోనే విడుదల కానుందని చిత్ర బృందం వెల్లడించింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular