HomeTeluguవాట్సాప్‌కు పోటీగా ‘అరట్టై’.. మేడ్ ఇన్ ఇండియా మెసేజింగ్ యాప్ ఫీచర్లు అదుర్స్!

వాట్సాప్‌కు పోటీగా ‘అరట్టై’.. మేడ్ ఇన్ ఇండియా మెసేజింగ్ యాప్ ఫీచర్లు అదుర్స్!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ‘వాట్సాప్‌’ను ఉపయోగిస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీ కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూ వస్తోంది. అయితే వాట్సాప్ అమెరికాకు చెందిన యాప్. దీనికి పోటీగా భారత్‌లో ఇప్పటివరకు వచ్చిన ‘టెలిగ్రామ్‌’ యాప్ పెద్దగా సక్సెస్ కాలేదు.

అయితే తాజాగా చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ (Zoho Corporation) ‘వాట్సాప్‌’కు పోటీగా ‘అరట్టై’ (Arattai) అనే స్వదేశీ మెసేజింగ్ యాప్‌ను లాంచ్ చేసింది. తమిళంలో ‘అరట్టై’ అంటే మాట్లాడుకోవడం అని అర్థం. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్‌’ పిలుపులో భాగంగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే క్రమంలో ఈ యాప్‌ను విడుదల చేశారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇది ఫ్రీగా డౌన్‌లోడ్‌కి అందుబాటులో ఉంది.

Arattai ముఖ్య ఫీచర్లు

ప్రాథమిక కమ్యూనికేషన్: టెక్స్ట్ మెసేజ్‌లు, వాయిస్ నోట్‌లు, ఆడియో, వీడియో కాల్స్.

గ్రూప్ చాట్‌లు, ఛానెల్స్: ఒకేసారి గరిష్టంగా 1,000 సభ్యులతో గ్రూప్ చాట్ సౌకర్యం. అప్‌డేట్‌లు, వార్తల కోసం ఛానెల్స్, స్టోరీస్ ఫీచర్లు.

మీడియా షేరింగ్: ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లు షేర్ చేసే వీలుంది. తక్కువ నెట్ స్పీడ్ ఉన్నా వేగంగా పనిచేస్తుంది.

ప్రైవసీ & సెక్యూరిటీ: యూజర్ డేటా భారతీయ సర్వర్లలోనే నిల్వ ఉంటుంది. వాయిస్, వీడియో కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంది. టెక్స్ట్ మెసేజ్‌లకు త్వరలోనే ఈ సదుపాయం ఇవ్వనున్నట్టు కంపెనీ తెలిపింది.

మల్టీ-డివైస్ సపోర్ట్: మొబైల్, డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్ టీవీ వంటి పలు డివైజ్‌లలోనూ ఉపయోగించవచ్చు.

Special Features

Pocket: ముఖ్యమైన నోట్‌లు, ఫైళ్లు, మీడియాను సేఫ్‌గా స్టోర్ చేసుకునే వ్యక్తిగత క్లౌడ్ స్టోరేజ్.

Meetings: యాప్‌లోనే వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్స్ షెడ్యూల్ చేయడం, జాయిన్ అవ్వడం.

ప్రత్యేకత

వాట్సాప్‌తో పోలిస్తే మెసేజ్ ఎన్‌క్రిప్షన్‌లో కొంత వెనుకబడి ఉన్నా, ‘మేడ్ ఇన్ ఇండియా’ పేరు, డేటా ప్రైవసీకి ఇచ్చే ప్రాధాన్యం వల్ల వినియోగదారులను ఆకట్టుకుంటోంది. జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ప్రకారం.. విడుదలైన మూడు రోజుల్లోనే యాప్ ట్రాఫిక్ 100 రెట్లు పెరిగిందని, రోజుకు కొత్తగా 3,000 నుంచి 3.5 లక్షల వరకు యూజర్లు సైన్‌అప్ అవుతున్నారని తెలిపారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular