HomeMovie News Teluguనయనతారేనా! చూసేందుకు రెండు కళ్లూ చాలేనా!

నయనతారేనా! చూసేందుకు రెండు కళ్లూ చాలేనా!

వెండిలా మెరిసిపోతోన్న ఈ మంచు కొండల్లో అంతకన్నా అందమైన తాజా మల్లె పూవులా మెరిసిపోతోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా? ముద్దుగుమ్మ నయనతార. చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు ఈ ఫోటోలో నయనతార అందం. వెన్నపూసలాంటి ఆ మంచుకొండల్లో ఇంతలా మురిసిపోతోన్న నయన్‌ బ్యూటీని వర్ణించడానికి మాటలు చాలటం లేదు. తెల్లని మంచులో పాలనురుగులాంటి తెల్లటి గౌనులో మురిసిపోతోంది. తమిళంలో తెరకెక్కుతోన్న ‘వెలై క్కారన్‌’ సినిమాలోని ఓ సాంగ్‌ షూట్‌ కోసం ఇలా మంచు కొండల్లో తళుక్కున మెరిసింది. శివకార్తికేయన్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది.

మోహన్‌రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు శివకార్తికేయన్‌. తెలుగబ్బాయిలానే ఆకట్టుకున్నాడు. సో ఈ సినిమా శివకార్తికేయన్‌కు తెలుగులోనూ మంచి గుర్తింపు తీసుకురానుందని భావిస్తున్నారు. కాగా నయనతార సంగతి చెప్పనే అక్కర్లేదు. అమ్మడు తెలుగులో హాట్‌ కేక్‌లాంటిది. ఈ ముద్దుగుమ్మ సినిమాలకు తెలుగులో బోలెడంత క్రేజ్‌ ఉంది. ‘మయూరి’ తదితర హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి.

ఇవన్నీ ఇలా ఉండగా, నయనతార ప్రస్తుతం తెలుగులో చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తోంది. రామ్‌ చరణ్‌ నిర్మాణంలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. మరో పక్క నందమూరి నటసింహం బాలయ్యతో ‘జై సింహా’ సినిమాలోనూ నటిస్తోంది. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular